Monday, December 23, 2024

అంబేడ్కర్ పేరుతో జగన్ రాజకీయాలు: శ్రవణ్ కుమార్

- Advertisement -
- Advertisement -

అమరావతి: అంబేద్కర్‌ను అడ్డుపెట్టుకొని సిఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. అవినీతి కేసులో కోర్టు బోనులో నిలబడ్డ జగన్‌కు అంబేడ్కర్ విలువ తెలుసా? అని ప్రశ్నించారు. జగన్ కుట్రలు తెలుసుకోలేనంత అమాయకులు దళితులు కాదని హెచ్చరించారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే మారణహోమం సృష్టించిన వారిపై పెట్టిన కేసులు ఎత్తివేస్తారా? అని అడిగారు. కాపుల ఓట్ల కోసం కేసుల విత్‌డ్రా డ్రామాలు ఆడుతున్నారని శ్రవణ్ కుమార్ దుయ్యబట్టారు. కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడమే జగన్ పనిగా మారిందని దుయ్యబట్టారు. ఆర్థిక నేరాలకు తోడ్పాటు అందించేలా జగన్ వ్యవహరిస్తున్నారని శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News