Friday, December 27, 2024

ప్రధానికి, ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాయబోతున్న మాజీ సిఎం జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డుల్లో జంతువు కొవ్వు ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయనున్నారు. ‘‘చివరికి నేను లేఖలు రాయబోతున్నాను. వాస్తవాలను చంద్రబాబు ఎలా వక్రీకరిస్తున్నాడో తెలిపి, చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరబోతున్నాను’’ అని జగన్ తెలిపారు. ఇదిలావుండగా టిడిపి నాయకుడు శ్రీభరత్ మతుకుమిల్లి తిరుపతి లడ్డులో ఉపయోగించింది శుద్ధమైన నెయ్యి కాదని ల్యాబ్ రిపోర్టులు చెబుతున్నాయని, అది పాల వెన్నెతో చేసిన నేయి కాదని, ఆవు, పంది కొవ్వు, వెజిటేబుల్ ఆయిల్స్ మిక్స్ అని ఆరోపించారు. ఎవరేది చెప్పినా నిజాలు వెలికి రావలసిందే. ఎవరు అబద్ధాలు చెబుతున్నారో ప్రజలకు తెలియాల్సిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News