Monday, December 23, 2024

వివేకానంద చనిపోయిన విషయం జగనే చెప్పారు: అజేయకల్లం

- Advertisement -
- Advertisement -

అమరావతి: సిబిఐ అధికారులు తనని కలిసి మాట్లాడారని, తనకు తెలిసిన సమాచారం చెప్పానని సిఎం జగన్ మోహన్ రెడ్డి సలహాదారు అజేయకల్లం చెప్పారు. వివేకానంద రెడ్డి మరణించిన విషయం జగనే తమకు చెప్పారని, వివేకా గుండెపోటుతో చనిపోయారనే విషయమే తమకు చెప్పలేదని స్పష్టం చేశారు. గుండెపోటా? మరో కారణమా? అనే విషయం సిబిఐ తనని అడగలేదని, ఆ రోజు నలుగురం ఉన్నామని, వారిలో తానొకడిని అని అజేయకల్లం వెల్లడించారు. ఆ సమయంలో జగన్ ఏం చెప్పారో తనకు గుర్తు లేదన్నారు. అనధికారంగా సిబిఐ అధికారులు తనతో మాట్లాడారని, తన నుంచి ఎలాంటి స్టేట్‌మెంట్ తీసుకోలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News