- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తన భద్రత కుదింపుపై జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టులో ఇరు వర్గాల వాదనలు కొనసాగాయి. జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా పనిచేయడం లేదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. దాంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం నిర్వహణ బాధ్యత ఎవరిదని హైకోర్టు ప్రశ్నించింది. ఇంటెలిజెన్స్ దని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. దాంతో న్యాయమూర్తి మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జామర్ ఇవ్వొచ్చు కదా అని అడిగారు. దానికి అటార్నీ జనరల్ వేరే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందో లేదో తెలుసుకుని చెబుతానని కోర్టుకు విన్నవించుకున్నారు.
- Advertisement -