Thursday, December 19, 2024

ఆ పార్టీలకు సేనాధిపతులే ఉన్నారు.. సైన్యం లేదు: సిఎం జగన్

- Advertisement -
- Advertisement -

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరోసారి ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న తనను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమై వస్తున్నాయని అన్నారు. మన భవిష్యత్ పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టిడిపి, జనసేన, బిజెపి కూటమిపై విమర్శలు చేశారు. చంద్రబాబు.. అధికారం కోసం ఓ జాతియ పార్టీ, నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని మరోపార్టీతో పొత్తుపెట్టుకుని జగన్ ను ఓడించేందుకు వస్తున్నాడని.. మీరందరూ ఆ మనిషికి మరోసారి తగిన బుద్ధి చెప్పాలన్నారు.

ఆదివారం ప్రకాశం జిల్లా మేదరమెట్లలో నిర్వహించిన వైసీపీ సిద్ధం సభలో జగన్ మాట్లాడుతూ.. జమ్మిచెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని ప్రయోగించాల్సిన సమయం వచ్చిందన్నారు. మరో 4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రావొచ్చని అన్నారు. పలు పార్టీలు పొత్తు పెట్టుకుని మన మీద దాడి చేసేందుకు సిద్దమయ్యారన్నారు. అయితే, ఆ పార్టీలకు సేనాధిపతులే ఉన్నారు.. సైన్యం లేదని జగన్ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News