Monday, December 23, 2024

వైసిపిని మరోసారి గెలిపించడానికి సిద్ధమా..?

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో లంచాలు, వివక్షకు తావు లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎంతో పారదర్శకంగా పాలన చేస్తున్నామని.. ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చామన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించడానికి సిద్ధమా..? అని జగన్ ప్రశ్నించారు.

ఏలూరు జిల్లా దెందులూరులో శనివారం వైసిపి ఆధ్వర్యంలో సిద్ధం సభను నిర్వహించారు. ఈ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. ఈ సభలో సీఎం జగన్ పాల్గొని మాట్లాడారు. జగన్‌ ఏనాడూ ఒంటరి కాదు.. దేవుడు, ప్రజలే తనకు తోడు, బలమని అన్నారు. శత్రువులందరూ ఏకమయ్యారని.. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు సిద్ధమా..? అంటూ జగన్ ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. మీ అందరినీ చూస్తుంటే జగన్‌ ఒంటరిలా కనిపిస్తారా?.. జగన్‌ ఏనాడూ ఒంటరి కాదన్నారు. ఎన్నికల రణక్షేత్రంలో మీది కృష్ణుడి పాత్ర.. తనది అర్జునుడి పాత్ర వంటిదన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నాడని సీఎం జగన్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News