Sunday, December 22, 2024

పేదలు బాగుపడడం తట్టుకోలేక పెత్తందారులు దుష్ప్రచారాలు: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: మంచి జరిగితే జగనన్నకు తోడుగా ఉండాలని ఆంధ్రా ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. జగనన్న విద్యాదీవెన నాలుగో విడత నిధుల విడుదల చేశారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సాయం నేరుగా పిల్లల తల్లుల ఖాతాల్లోకే వస్తాయన్నారు. పిల్లలకు మనం ఇచ్చే చదువే ఆస్తి అని అన్నారు. పేదరికం చదువుకు అవరోధం కాకూడదన్నారు. పేద పిల్లలు చదవండని, మీ చదువులకు తాను ఉన్నాను అని జగన్ స్పష్టం చేశారు. అక్షరాలు రాయడం అక్షరాలు చదవటం మాత్రమే విద్యకు పరమార్థం కాదన్నారు. పిల్లల్ని మోసం చేసిన బాబు ఇప్పుడు చదువు గురించి మాట్లాడుతున్నాడని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు.

తమ భూములు ఉన్న ప్రాంతంలోనే రాజధాని కట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయన్నారు. పేదలు బాగుపడడం తట్టుకోలేక ఈ పెత్తందారులు దుష్ప్రచారాలు చేస్తున్నారని, సిఎం జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కడం మొదలు పెడితే వారికి పుట్టగతులుండవని ఎద్దేవా చేశారు. రైతుల్ని మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడని జగన్ మండిపడ్డారు. అక్క చెల్లెళ్లను మోసం చేసిన బాబు మహిళ సాధికారికత గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వాళ్లు లెక్చర్లు దంచుతుంటే ఇదేం ఖర్మరా బాబు అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని, బాబులు, దత్తపుత్రుల దుష్ప్రచారాలు నమ్మనే నమ్మొద్దన్నారు. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అదే కొలమానంగా తీసుకోవాలన్నారు. గజదొంగల ముఠాకు దుష్టచతుష్టయం అని పేరు జగన్ ఉందన్నారు. ఈ గజ దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకో, పంచుకో తినుకో అన్నట్టు వ్యవహరించిందన్నారు. అందుకే ఆ రోజు బటన్లు లేవని, మంచి చేసేవాళ్లు లేరన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News