Thursday, January 23, 2025

పూరి రథయాత్రలో తొక్కిసలాట

- Advertisement -
- Advertisement -

ఒకరి మృతి, 400మందికి గాయాలు

పూరి: దేవుళ్లు గర్భగుడి వీడి పురవీధుల్లోకి వచ్చే అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. భారత రాష్ట్రపతి ద్రౌ పది ముర్మూ, పలువురు కేంద్ర మంత్రులు, ఒడిషా ముఖ్యమంత్రి ఇతర ప్రముఖులు ఈ రధయాత్రకు విచ్చేసారు. లక్షలాది జనం త రలిరావడం, దేవతామూర్తులను తిలకించేందుకు ఒక్కసారిగా ముందుకు ఉరికిన సందర్భంలో తొక్కిసలాట జరిగింది. దీనితో 400 మంది గాయపడ్డారు.

ఒక్కరి పరిస్థితి విషమం గా ఉందని వెల్లడైంది. సముద్రతీర పట్టణం ఆదివారం జనసముద్రమైంది. రథయాత్ర ఆ రంభమై బారా దండా, గ్రాండ్ రోడ్ మీదుగా వెళ్లుతున్న దశలో జనం అదుపు తప్పడంతో తొక్కిసలాటకు దారితీసింది. పరిస్థితిని అతి కష్టం మీద అదుపులోకి తీసుకువచ్చారు. ర థాన్ని లాగే క్రమంలో అంతా పోటీపడేందు కు ముందుకు రావడం గందరగోళానికి దా రితీసింది. జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్రల విగ్రహాలతో కూడిన వేర్వేరు రథాలు పు రవీధులలో సాగాయి. రెండు రోజుల పాటు ఈ రధోత్సవం సాగుతుంది. 12వ శతాబ్ధాని కి చెందిన అత్యంత పురాతనమైన ఈ పూరి క్షేత్రంలో విగ్రహాల పయనం ప్రధాన ఆల యం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరం లో ఉండే గుండిచ ఆలయం వరకూ చేరుకునేందుకు పలు గంటల సమయం పడుతుం ది. స్వామి సోదరుడు బలరాముడితో కలిసి తమ మేనత్త యశోద (స్థానికంగా గుండిచ దేవి) ఆలయానికి వెళ్లి విడిది చేయడం ఈ ర ధయాత్ర కీలక అంశం. అక్కడ రథాలు వా రం రోజులు ఉంటాయి. ఎనిమిదో రోజు తిరిగి మునుపటి స్థానానికి చేరుకుంటాయి.

రథయాత్రలో అపశ్రుతి

ఒడిశాలోని పూరీలో విశ్వవిఖ్యాత జగన్నా థుడి రథయాత్రలో విషాద సంఘటన జరి గింది. రథం లాగుతుండగా తోపులాట జరి గి ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. దాదా పు 400మందికి పైగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పూరీ రాజు గజప తి దివ్యసింగ్ దేవ్ రథాల ముందు చెరాపహ రా (చీపురుతో రథాల ముందు ఊడ్చడం) పూర్తిచేశారు. సాయంత్రం 4 గంటలకు ర థాలకు సారథులు, అశ్వాలు అమర్చి తాళ్లు కట్టారు. అనంతరం బలభద్రుని తాళధ్వజ రథం ముందుకు కదిలింది. కొద్దిసేపటికే భ క్తుల మధ్య తోపులాట జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News