Monday, December 23, 2024

జాతీయ జల అవార్డు అందుకున్న జగన్నాథపురం సర్పంచ్ భవాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో శనివారం జాతీయ నీటి అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉత్తమ నీటి విధానాలను అవలంబించడంతో పాటు ప్రజల్లో అవగాహ న కల్పించినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం దేశంలోనే ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైంది. ఈసందర్భంగా గ్రామ సర్పంచ్ గడ్డ భవాని, పంచాయతీ సెక్రటరీ షేక్ ఇబ్రహీం కలిసి ఉప రాష్ట్రపతి జగదీప్ దనకడ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ రాష్ట్రంగా మధ్యప్రదేశ్ మొదటి బహుమతి అందుకోగా, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. ఉత్తమ జిల్లాల్లో తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లాకు మూడవ అవార్డ్ లభించింది. నీటి నిర్వహణ, సంరక్షణలో ఏపీలోని చాగలమర్రి కస్తూర్బా స్కూల్‌కు రెండవ బహుమతి లభించింది. హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి రెండవ అవార్డ్ దక్కింది. ఉత్తమ పరిశ్రమగా తిరుపతిలోని సీసీఎల్ ఇండియా లిమిటెడ్‌కు మూడవ బహుమతి దక్కింది. ఉత్తమ స్వచ్ఛంద సంస్థల విభాగంలో అనంతపురం ఏషియన్ ప్రాటేర్నాకు ప్రత్యేక అవార్డ్‌ను అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News