Monday, December 23, 2024

ఇడుపులపాయ నుంచి జగన్ ఎన్నికల ప్రచారం మొదలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బుధవారం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం మొదలెట్టారు. కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి తన 21 రోజుల బస్సు టూర్ ను  ఆరంభించారు. ‘మేమంతా సిద్ధం’ పేరిట మొదలుపెట్టే ఈ ప్రచారానికి ముందు ఆయన తన తండ్రి, పూర్వ ముఖ్య మంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. ఆయన తండ్రి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

మొదటి రోజున ఆయన బస్సు వెంపల్లి, విఎన్ పల్లి, యెర్రగుంట్ల, పోట్లదుత్తి గ్రామాలు, ప్రొద్దుటూర్ పట్టణంలో ప్రయాణించనున్నది. కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూర్ నియోజకవర్గాలను కవర్ చేయనున్నది. మొదటి రోజున నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో ఆయన రాత్రి బస చేయనున్నారు.

రెండవ రోజు, ఆళ్లగడ్డలోని యెర్రగుంట్లలో ఆయన ఉదయం 11 గంటలకు మాటామంతీ నెరుపనున్నారు. కాగా నంద్యాలలో సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి మొదలయి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగియనున్నది. కాగా ఈ బస్సు యాత్ర 21 జిల్లాల్లో, 148 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయనున్నది. ఈ బస్సు యాత్ర మొదట్లో రాయలసీమ ప్రాంతంలోనే జరుగనున్నది. రాయలసీమలోని కడప, కర్నూల్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలను కవర్ చేయనున్ర్నారు. తాను ప్రయాణించే ప్రాంతాల్లో జగన్ ప్రజలతో మమైకం కానున్నారు. వారితో సమయాన్ని గడుపనున్నారు. ముఖ్యంగా రాత్రుళ్లలో ఆయన బస చేసే చోట ప్రజలతో మాటామంతీ నెరుపనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానలకు, 25 లోక్ సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగనున్నది.

Jagan Bus Tour

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News