Monday, December 23, 2024

‘రామబాణం’ మంచి ఉద్దేశంతో చేసిన సినిమా: జగపతి బాబు

- Advertisement -
- Advertisement -

‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘రామబాణం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది. మే 5న రామబాణం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హీరో జగపతి బాబు విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

రామబాణం కథ ఒప్పుకోవడానికి కారణం ?
ఇప్పుడన్నీ హారర్, యాక్షన్ , థ్రిల్లర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామా వచ్చి చాలా కాలమైంది. అలాగే గోపీచంద్, శ్రీవాస్, నేను కలిసి లక్ష్యం చేశాం. ఇది మెయిన్ ఎట్రాక్షన్. అలాగే రామబాణం లో అన్నదమ్ముల కాన్సెప్ట్ అద్భుతంగా కుదిరింది. గతంలో చేసిన శివరామరాజు కూడా కూడా అన్నదమ్ముల కథే. ఆ సినిమా చూసి విడిపోయిన కొన్ని కుటుంబాలు కలిశాయి. రామబాణం కూడా చాలా మంచి ఉద్దేశంతో చేసిన సినిమా. సింగిల్ సెన్సార్ కట్ కూడా లేకుండా హాయిగా ఓ మంచి సినిమా చూసామనే అనుభూతిని కలిగిస్తుంది రామబాణం.

జగపతి బాబు గారి పాత్ర బావుండాలని హీరోలు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు కదా.. ఆ కోణంలో చూసుకుంటే రామబాణంలో మీ పాత్ర ఎలా వుంటుంది?
ఇప్పటి వరకూ దాదాపు 70కి పైగా క్యారెక్టర్ రోల్స్ చేశాను. అయితే ఇందులో చెప్పుకోవడానికి ఏడెనిమిది సినిమాలే వున్నాయి. కొన్ని సరిగ్గా వాడుకోలేదనే చెప్పాలి. రామబాణంలో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అన్నదమ్ముల కథ కావాలి, ఇద్దరి పాత్రలు పండితేనే సినిమా ఆడుతుందని గోపిచంద్ ఖచ్చితంగా ఉన్నారు. అది క్లైమాక్స్ లో తెలుస్తుంది. ఈ విషయంలో గోపీచంద్ ని మెచ్చుకోవాలి. సెంటిమెంట్ తగ్గిపోయిన రోజుల్లో ఇలాంటి కథలు రావడం చాలా అవసరమని నా భావన.

నెగిటివ్ రోల్స్ బలంగా చేస్తున్న సమయంలో మళ్ళీ పాజిటివ్ రోల్స్ వైపు రావడానికి కారణం ?
నేను యాక్టర్ ని. అందులోనూ డైరెక్టర్ యాక్టర్ ని. డైరెక్టర్ కి ఏం కావాలో వాళ్ళ కళ్ళలో చూస్తే అర్థమౌతుంది. ఆ ఫీల్ వచ్చినపుడు ఫెర్ ఫార్మెన్స్ కూడా బావుంటుంది ఇప్పుడు మంచి డైరెక్టర్స్ వున్నారు. కొన్నిటికి కాంబినేషన్ కుదురుతుంది.

అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలు అయిపోతున్నాయి ? ఫ్యామిలీ కథలు జనాలు చూడటం లేదనే అభిప్రాయం కూడా వుంది. ఇలాంటి సమయంలో రామబాణం రావడం ఎలా అనిపిస్తుంది ?
రామబాణం గొప్పదనం అదే. ఇప్పుడు సెంటిమెంట్ తగ్గిపోయింది. నెగిటివిటీ పెరిగిపోయింది. సినిమా ఎంత క్రూరంగా వుంటే అంత బావుంటుంది. అందుకే నేను సక్సెస్ అయ్యాను( నవ్వుతూ). అయితే అంత నెగిటివిటీలో కూడా పాజిటివిటీ వుందని చెప్పడానికి వస్తుంది రామబాణం.

కుష్బూ గారితో కలసి పని చేయడం ఎలా అనిపించిది ?
కుష్బూ కి నాకు స్నేహం చిన్నప్పటి నుంచి వుంది. కానీ ఎప్పుడూ సినిమా చేయడం కుదరలేదు. తను మంచి కంఫర్ట్ బుల్ ఆర్టిస్ట్. తనతో ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ వర్క్ చేస్తా.

ఇప్పుడు ఏదైనా పాత్ర నచ్చక పొతే నో చెప్పగలుగుతున్నారా ?
కాంబినేషన్ వుంటే చాలు సెట్ ప్రాపర్టీ గా కావాలనుకునే పాత్రలు చేయడం లేదు. ఒక రిచ్ నెస్ కావాలి, జగపతి బాబు వున్నాడు పెట్టేయండనే సినిమాలకి నేను రాను. గతంలో అలాంటివి తప్పక చేశాను. కానీ ఇప్పుడు అలాంటి వాటికి నో చెబుతున్నా.

బాలీవుడ్ వలన మైలేజ్ వస్తుందా ?
వంద శాతం వస్తుంది. అందులో సల్మాన్ ఖాన్ తో చేసిన సినిమాతో డౌట్ లేకుండా వచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఎక్కువ అవకాశాలు వున్నాయి.

రామబాణం కాంబినేషన్ కోసం చేశారా లేదా కథ నచ్చిందా ?
ఎప్పుడైనా కథే ముఖ్యం. కాంబినేషన్ అనేది ఒక ఆసక్తిని కలిగిస్తుంది తప్పితే అల్టిమేట్ గా కథే నిలబెడుతుంది.

సెకండ్ ఇన్నింగ్స్ లో మార్కెట్, స్టార్ డమ్ పెరిగాయి కదా ? ఎలా అనిపిస్తుంది
నా జీవితమే పెరిగింది.(నవ్వుతూ) ఈ ఫేజ్ అన్ని రకాలుగా బావుంది. హీరో అనేది పెద్ద భాద్యత. ఇప్పుడా ఒత్తిడి లేకపోవడంతో దర్శకుడు కోరుకునే పెర్ఫార్మెన్స్ డెలివర్ చేయడం ఇంకా సులువవుతుంది.

సెకెండ్ ఇన్నింగ్స్ లో మీకు బాగా నచ్చిన పాత్ర ?
లెజెండ్ లో చేసిన పాత్ర. అది అన్ బిలివిబుల్ క్యారెక్టర్. తర్వాత అరవింద సమేత, రంగస్థలం కూడా తృప్తిని ఇచ్చాయి.

రామబాణం లో ఆర్గానిక్ ఫుడ్ అనే పాయింట్ వుంది. మీరు ఆర్గానిక్ ఫుడ్ ఇష్టపడతారు దాని గురించి ?
ఆర్గానిక్ ఫుడ్ అనేది లేదు. మనం తినే రైస్ లో కూడా లేదు. చద్దన్నం యూఎస్ లో కూడా హెల్తీ ఫుడ్. ఆ సెన్స్ వస్తుంది. కానీ ఎవరూ సరిగా ఫాలో కావడం లేదు. నాకు చద్దన్నం, పప్పుచారు అన్నం చాలాఇష్టం. ఇప్పటికీ అదే తింటాను.

సముద్రం అనే వెబ్ సిరిస్ అనుకున్నారు కదా ? ఏమైయింది?
మెటిరియల్ షూట్ చేశాం. కానీ మేము అనుకున్నట్లు రాలేదు. దీంతో నా లైబ్రరీ లోనే ఉంచేశాను. అలాంటి కంటెంట్ తీసే సెన్స్బిలిటీ వున్న దర్శకుడు దొరికినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను.

దర్శకుడు శ్రీవాస్ గురించి ?
దర్శకుడు శ్రీవాస్ రామబాణం బలంగా మలిచాడు. లక్ష్యం విజయం సాధించింది కాబట్టి బ్రదర్స్ ఎమోషన్స్ పాజిటివ్ గా వెళ్దామని మొదటి నుంచి కథపై వెళ్ళారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు గురించి ?
మోస్ట్ కంఫర్ట్ బుల్ ప్రోడ్యూసర్స్. సినిమాకి ఏం కావాలి ఎలా కావాలనేది తెలుసుకొని అన్నీ సమకూర్చే నిర్మాతలు. నేను ఈ మధ్య కాలంలో పని చేసిన మంచి ప్రొడక్షన్ హౌస్ లో పీపుల్ మీడియా ఒకటి. వారితో మరో సినిమా కూడా చేశాను. తర్వలో విడుదలౌతుంది.

చిన్న సినిమాలు, యవ దర్శకులు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే వారి కోణం ఎలా వుంది ?
చిన్న సినిమా అనేది ఉండదు. సినిమా హిట్ అయితే పెద్ద సినిమా అవుతుంది. కలర్ ఫోటో, కేరాఫ్ కంచరపాలెం,బలగం సినిమాలు చూశాను. నాకు చాలా నచ్చాయి. అందులో నేను లేను అనే బాధ కూడా వుంది. అయితే నేను చిన్న సినిమాలు చేయను, వారికి అందనని ఫిక్స్ అయిపోయారు. రెండూ తప్పే. నాకు డబ్బు ప్రాధాన్యత కాదు. పాత్ర, సినిమా ముఖ్యం. నాకు రెమ్యునిరేషన్ కంటే ప్యాషన్ ముఖ్యం.

చాలా పాత్రలు చేసారు కదా.. ఇంకా చేయాలనుకునే పాత్ర ఉందా ?
నాకు గాడ్ ఫాథర్ లాంటి పాత్ర చేయాలని వుంది. అలాగే గాయం కు మరో స్థాయిలో వుండే పాత్ర చేయాలని వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News