Monday, December 23, 2024

జూలై 7న ‘రుద్రంగి’

- Advertisement -
- Advertisement -

జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమల రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రుద్రంగి’. ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జూలై 7న విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది.

ఇప్పటికే అన్ని పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్స్. పాటలు, టీజర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిందీ సినిమా. ఒకప్పటి తెలంగాణ సామాజిక పరిస్థితులను నేపథ్యంగా ఎంచుకుని పీరియాడిక్ మూవీగా ‘రుద్రంగి’ రూపొందింది. నాటి తెలంగాణాలో దొరల ఆగడాలు ఎలా ఉన్నాయి అనేది కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికర కథా కథనాలతో సినిమా ఆకట్టుకోబోతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News