- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాజకీయాల నుంచి నటనలోకి రానున్నారు. ‘ జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్’ పేరుతో సినిమా తీయనున్నట్టు సమాచారం. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా రానుంది. తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరణ చేయనున్నారు. ఓ ప్రేమ కథ సినిమాలో నటిస్తున్నానని జగ్గారెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిజ జీవిత పాత్రనే సినిమాలో పోషిస్తున్నానని వివరించారు. త్వరలో సినిమా వివరాలు వెల్లడిస్తానన్నారు. రాజకీయాలలో కూడా తన సేవలు ఉంటాయని చెప్పారు. సినిమాలో మాఫియాను ఎదురించి ఓ ఆడపిల్ల పెళ్లి చేయడమే లక్ష్యంగా సినిమా కథ ఉండునున్నట్టు సమాచారం. ఉగాది వరకు కథ వినని తరువాత సినిమా పేరు ప్రకటిస్తానని, పిసిసి, ముఖ్యమంత్రి సమాచారం ఇచ్చిన తరువాతనే సినిమా చేస్తానని పేర్కొన్నారు.
- Advertisement -