Wednesday, January 8, 2025

రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి సవాల్

- Advertisement -
- Advertisement -

Jagga Reddy challenges Revanth Reddy

హైదరాబాద్: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తన స్థానంలో దమ్ముంటే అభ్యర్థిని నిలబెట్టి గెెలిపించాలని రేవంత్ కు జగ్గారెడ్డి సవాల్ విసిరారు. వీహెచ్ హరీశ్ రావుకు రావుకు కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. తన కూతురు కోసమే హరీశ్ రావును వీహెచ్ కలిశారని ఆయన పేర్కొన్నారు. పార్టీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేసేది ఎవరని జగ్గారెడ్డి అన్నారు. సోనియా, రాహులే అంతిమ నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ ఒక్కడే పార్టీని అధికారంలోకి ఎలా తీసుకొస్తాడు..? అంతా కలిస్తేనే ఏమైనా చేయొచ్చని ఆయన వెల్లడించారు. నాపై అభ్యర్థిని పెట్టి గెలిపించు.. అప్పుడే రేవంత్ నువ్వే హీరో అని ఆయన స్పష్టం చేశారు. ఇది కాంగ్రెస్ పంచాయతీ కాదన్న జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా వెళ్తున్నాడని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News