Thursday, January 23, 2025

దేశానికి టెక్నాలజీని అందించిన మహానేత రాజీవ్ గాంధీ : జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశానికి టెక్నాలజీని అందించిన గొప్ప నేత రాజీవ్ గాంధీ అని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ 70 ఏళ్లలో ఏం చేశారని అడిగే కెటిఆర్, హరీష్ , బిజెపి నేతలు విషయం తెలుసుకోవాలని సూచించారు. త్యాగం, దేశ భక్తి కలిగిన నేత రాజీవ్ గాంధీ అని ఆయన కొనియాడారు. టెలికమ్యూనికేషన్స్ ని ప్రజలకు అందించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. ప్రదాని మోడీ, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వాడుతున్న టెక్నాలజీ అంతా రాజీవ్ గాంధీ తెచ్చిందేనని ఆయనన్నారు.

జైల్లో ఉన్న బిడ్డతో కెసిఆర్ మాట్లాడుతున్నది కూడా రాజీవ్ గాంధీ తెచ్చిన టెక్నాలజీ తోనేనని, హైటెక్ సిటీకి పునాది రాజీవ్ ఆలోచనలేనని ఆయనన్నారు. రాజీవ్ గాంధీ ఎప్పుడూ ప్రధాని లా కాకుండా ఒక ఎంప్లాయి గా పని చేశారని, ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు రాజీవ్ గాంధీ అని తెలిపారు. రాజీవ్ గాంధీ టెలికమ్యూనికేషన్స్ ని తెచ్చారు, ఆయన ఐటీ కి పునాది వేసిన తరవతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీకి పునాది వేశారని తెలిపారు. మీ చేతుల్లోనే రాజీవ్ గాంధీ ఉన్నాడని, గాంధీ కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. ఓటు ద్వారా ఎన్నికల వ్యవస్థ నెహ్రు తెస్తే, 18 ఏండ్లు నిండిన యువత కి ఓటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ అని తెలిపారు.

మోడీ తెచ్చిందేమి లేదనే విషయం యువత ఆలోచించాలన్నారు. దేశానికి శాంతి సందేశం ఇచ్చింది రాజీవ్ గాంధీ అని, శ్రీలంక పై ఎల్‌టిసి దాడులను కాపాడింది రాజీవ్ గాంధీ అని ఆ కుట్ర తోనే రాజీవ్ గాంధీని ఎల్‌టిటి పొట్టన పెట్టుకున్నారని జగ్గారెడ్డి తెలిపారు. బిజెపి నేతలకు ఇలాంటి చరిత్ర ఉందా అని ఆయన ప్రశ్నించారు. గాంధీ కుటుంబం బలిదానాల కుటుంబమని, దేశభక్తుల కుటుంబమని చెప్పుకొచ్చారు. త్యాగం, దేశ భక్తి కలిగిన నేత రాజీవ్ గాంధీ అని తండ్రి ఆశయాల కోసం రాహుల్ గాంధీ చేస్తూ జోడో యాత్ర చేస్తున్నాడని తెలిపారు. దేశ ప్రజల ను కుటుంబ సభ్యులు గా భావించిన నేత రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News