Sunday, December 22, 2024

బయట పులి.. అసెంబ్లీలో పిల్లి..

- Advertisement -
- Advertisement -

గవర్నర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ : గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. బయట పులిలా గర్జించిన గవర్నర్.. అసెంబ్లీలో పిల్లిలా ప్రసంగించారని ఆరోపించారు. అలా మాట్లాడకపోతే ఆమె మైక్ కూడా కట్ అవుతుందన్నారు. శాసనసభలో కనబడాలనుకున్నారు.. కనిపించారు.. అంతే అన్నారు.

సిఎం కెసిఆర్ ఇచ్చిన డైరెక్షన్‌లో గవర్నర్ నడిచారని, తప్పనిసరి పరిస్థితుల్లో సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై మధ్య రాజీ కుదిరిందని.. చివరకు తుస్సు మనిపించారన్నారు. సమావేశాల్లో సంగారెడ్డి సమస్యలతో పాటు.. రాష్ట్ర సమస్యలపై మాట్లాడుతానని వెల్లడించారు. మెట్రో ట్రైన్ పఠాన్ చెరు నుంచి సంగారెడ్డి.. సదాశివ పేట వరకు పొడిగించాలని అన్నారు. యాదగిరిగుట్ట వరకు మెట్రో విస్తరించాలని తెలిపారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర విభజన తరవాత పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చే జీవో రద్దు చేశారని తెలిపారు. అంగన్‌వాడీ, వీఆర్వో.. ఐకేపీ ఉద్యోగులు, సర్పంచుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News