Thursday, January 23, 2025

కెసిఆర్ సిఎం రేవంత్‌ని అపాయింట్‌మెంట్ అడుగు:జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

మాజీ సిఎం కెసిఆర్, సిఎం రేవంత్‌ని అపాయింట్‌మెంట్ అడుగు, సచివాలయం వెళ్లి సమస్యలపై చర్చ చేయాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కెసిఆర్ ప్రకటన చేస్తే వాటికి ఎప్పుడైనా విలువ ఉందా? అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా మాటకు కట్టుబడి ఉన్నారా..? అని జగ్గారెడ్డి మండిపడ్డారు. చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే మాకెందుకు ప్రజలు అధికారం ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్‌ను అసెంబ్లీకి రావాలని సలహాలు సూచనలు ఇవ్వాలని సిఎం రేవంత్ సూచించినా కెసిఆర్ రాలేదన్నారు. తెలంగాణలో రివర్స్ పాలిటిక్స్ నడుస్తున్నాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

బయట విలేకరుల సమావేశంలో మాట్లాడే కెసిఆర్ సభలోకి వచ్చి రుణమాఫీ గురించి మాట్లాడొచ్చు కదా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ పెట్టండి సమస్యలపై మాట్లాడాలని ప్రతిపక్ష నాయకుడు అడగాలి, కానీ, సిఎం అసెంబ్లీ పెట్టి ప్రతిపక్ష నాయకుడిని సభకు రావాలని పిలిచే పరిస్థితి వచ్చిందన్నారు. సిఎంగా ఉన్నప్పుడు కెసిఆర్ సచివాలయం రాలేదన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడం లేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. మీ హయంలో ప్రతిపక్ష నాయకులకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేని పరిస్థితి అని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. రుణమాఫీపై తాము ఇచ్చిన మాట ప్రకారం 9 నెలల్లో చేశామన్నారు. రుణమాఫీ కోసం రూ.12 వేల కోట్లు నిధులు రెడీగా ఉన్నాయన్నారు. ఇంటింటి సర్వే చేస్తుంది ప్రభుత్వమని సెప్టెంబర్ నెలాఖరు వరకు అందరికీ మాఫీ అయిపోతుందన్నారు. హరీష్ రావు అధికారం మజాలో ఉన్నాడని జగ్గారెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News