Wednesday, January 22, 2025

ఎపిని మూడు రాష్ట్రాలు చేయండి…వాళ్లే ముగ్గురు సిఎంలు: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: షర్మిల పాదయాత్ర కాదు కాళ్ళు చేతులు కొట్టుకున్నా తెలంగాణలో గెలవరని కాంగ్రెస్ ఎంఎల్ఎ జగ్గారెడ్డి చురకలంటించారు. తనని కెటిఆర్ కు కోవర్టు అని నింద వేసినందుకు జగ్గారెడ్డి రీకౌంటర్ ఇచ్చారు.  తెలంగాణలో టిఆర్ఎస్- కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని, బిజెపికి అర్థం కావడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో షర్మిల అనవసరంగా గందరగోళం చేస్తుందని, అమ్మాయి కదా అని అనలేక పోతున్నామని, మళ్ళీ మా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ కదా అని ఆలోచన చేస్తున్నామన్నారు. షర్మిలకి తనతో పంచాయితీ ఎంటో అర్థం కావడం లేదన్నారు.

 షర్మిల వ్యవహారం చుట్టరికం తోక పట్టుకొని తిరిగినట్టు ఉందని ఎద్దేవా చేశారు. అర్జెంట్ గా షర్మిల సిఎం అయిపోవాలనేది ఆమె కోరిక అని, విజయమ్మకి సలహా ఇస్తున్నానని, జగన్ కి చెప్పి షర్మిలను సిఎం చేయాలని సూచించారు. మీ ఇంట్లో పంచాయితీని జనానికి చుట్టవద్దని సూచించారు. ఎపిలో మూడు రాజధానుల పంచాయతీ నడుస్తుందని, మీ ఇంట్లో సిఎంల పంచాయితీ కోసం ఇక్కడ పంచాయితీ పెట్టవద్దని, మూడు రాజధానుల బదులు మూడు రాష్ట్రాలు చేసుకోవాలని జగ్గారెడ్డి సూచించారు. జగన్ మోడీకి గులామయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కుటుంబమంతా మోడీ దగ్గర కూర్చొని మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇచ్చారు.

* అమరావతికి జగన్ సిఎం , కడప, కర్నూల్ కి వై ఎస్ షర్మిల, విశాఖపట్నానికి విజయసాయి రెడ్డి సిఎం గా చేసుకోవాలని సూచించారు. ఊరు మీద పడతా అంటే ఎట్లా అని అడిగారు. తనని కెటిఆర్ కోవర్టు అని షర్మిల అనడం కాదు కానీ మా పార్టీ వాళ్ళు అన్నారని గుర్తు చేశారు. కోవర్టు అనే అంశంలో తమ పార్టీ వాళ్ళే ఎక్కువ బదనాం చేశారని మండిపడ్డారు. తాను అన్ని మతాలకు సమన్వయ కర్తను అని, షర్మిల లెక్క తాను బిజెపికి ఏజెంట్ ను కాదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని ఇంకా అంటే మాత్రం చాలా విషయాలు చెప్పాలి వస్తదని హెచ్చరించారు. షర్మిల, జగన్ మధ్య ఆస్తుల పంపకం కూడా కానట్టుందని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News