Thursday, December 26, 2024

ఢిల్లీకి వెళ్లిన జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జగ్గారెడ్డి 20 నిమిషాలు పాటు సమావేశమయ్యారు. ఇరువురు మధ్య జరిగిన విషయాలను జగ్గారెడ్డి మీడియాకు చెప్పడానికి నిరాకరించారు. బుధవారం ఆయన ఢిల్లీ వెళ్లడంపై పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. జగ్గారెడ్డికి ఎంఎల్‌సి లేదంటే పిసిసి అధ్యక్ష పదవి ఇస్తున్నట్టు సమాచారం. మరోవైపు మెదక్ ఎంపిగా జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి లేదా భార్య, సంగారెడ్డి డిసిసి అధ్యక్షురాలు నిర్మల పోటీ చేయనున్నట్టు సమాచారం. ఢిల్లీ పర్యటన తరువాత స్పష్టత వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News