Thursday, January 23, 2025

దండుపాళ్యం బ్యాచ్‌లా బిఆర్ఎస్ సోషల్‌ మీడియా: జగ్గారెడ్డి ఫైర్

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావులపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. వారిద్దరికీ మతిభ్రమించిందని దుయ్యబట్టారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అధికారం లేక కెటిఆర్, హరీశ్ రావు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని ఫైరయ్యారు.

ఇక, బిఆర్ఎస్ సోషల్‌ మీడియా దండుపాళ్యం బ్యాచ్‌లా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లను వదిలిపెట్టనని హెచ్చరించారు. తాను కలెక్టర్‌ను తిట్టినట్టు వీడియో క్రియేట్‌ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై ట్రోల్‌ చేసేవాళ్లు దొరికితే బట్టలూడదీసి కొడతాననని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News