Friday, December 20, 2024

ఆ రెండు యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఆర్ఎస్ ఏజెంట్ నని, కెటిఆర్ కోవర్ట్ అని రెండు యూట్యూబ్ ఛానెల్స్, అభిమాన సంఘాలు ప్రచారం చేస్తున్నారని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆదివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ”కాంగ్రెస్ లో వ్యక్తిగత పంచాయితీలు లేవు. కెటిఆర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు లేరా? చెప్పండి. పార్టీలు వేరైనా ఎదురుపడ్డప్పుడు మాట్లాడుకోవడం సంస్కారం. కెటిఆర్ ను కలిసినంత మాత్రాన.. నేను టిఆర్ఎస్ కోవర్డ్ అయినట్లా?. యూట్యూబ్ ఛానెల్స్ ఇష్టమొచ్చినట్లు రాస్తున్నాయి. కాంగ్రెస్ లో చిల్లర బ్యాచ్ తయారైంది. పార్టీని నాశనం చేస్తున్నది నేనా?, ఓ వ్యక్తి అభిమాన సంఘాలా?. టిఆర్ఎస్ పార్టీలోకి పోవాలనుకుంటే డైరెక్ట్ గా పోతా. నన్ను అడ్డుకునేదేవరు. పిసిసి చీఫ్ కాంగ్రెస్ కు డ్రైవర్ లాంటివారే. మేమంతా ప్రయాణికులం. ప్రయాణికులంతా డ్రైవర్ పై ఆదారపడి ఉంటారు. ప్రమాదం జరిగితే డ్రైవర్ తోపాటు ప్రయాణికులు చనిపోతారు. డ్రైవర్ పోస్టు బాధ్యతగలది. డ్రైవర్ సరిగా లేడు.. సరిదిద్దుకొమ్మని లేఖ రాశా. నేను కెటిఆర్ ను కలిస్తే కోవర్ట్ అంటున్నారు.. మరి రేవంత్, కెటిఆర్ కలినప్పుడు ఏమంటారో చెప్పాలి. దీనిక సమాధానం చెప్పకుండా మాట్లాడితే ఊరుకునేది లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jagga Reddy fires on Youtube Channels

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News