Tuesday, January 21, 2025

నా ఓటమికి హరీశ్‌ రావే కారణం:జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

కక్ష సాధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పేర్కొన్నారు. అలాంటి రాజకీయాలు ఏ పార్టీకి మంచిది కాదని ఆయన సూచించారు. అలాంటి రాజకీయాలు చేసే వాళ్లు అధికారం పోయా క బాధ పడాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ రివేంజ్ పాలిటిక్స్ చేసి ఫౌంహౌస్‌కు పరిమితం అయ్యారని జగ్గారెడ్డి తెలిపారు. రాజకీయ పార్టీకి పవర్ పర్మినెంట్ కాదని, మనం పవర్‌లో ఉన్నప్పుడు వారిని జైలుకు పంపించి, వారు అధికారంలో ఉన్నప్పుడు మనల్ని జైలుకు పంపించడం తాత్కాలికమన్నారు. చంద్రబాబు, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు కక్ష సాధింపు రా జకీయాలకు చేయలేదన్నారు.

ఎవరైనా తనకు నష్టం చేసినా తానెవ్వరికీ నష్టం చేయనని, రాజకీయ యుద్ధం మాత్రం చేస్తానని జ గ్గారెడ్డి చెప్పుకొచ్చారు. సోమవారం జగ్గారెడ్డి విలేకరులతో చిట్‌చా ట్ చేశారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా డబ్బులు తీసుకోకుం డా రాజకీయం చేస్తున్నట్లుగా ఎవరైనా ఒప్పుకుంటారా..?, తన తో సహా పైసలు ముట్టుకోకుండా రాజకీయం చేయని నాయకుడెవరూ ఉండరని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తాను ఓడిపోవడానికి హరీష్ రావు కారణమని ఆయన ఆరోపించారు. సిద్దిపేటలో గెలవడానికి హరీష్‌రావు ఎంత కష్టపడ్డారో, తనను ఓడగొట్టడానికి హరీష్‌రావు అంతే కష్టపడ్డారని ఆయన తెలిపారు. తన ప్లానింగ్ అంత హరీష్ భగ్నం చేశారని అన్నారు. పోలింగ్‌కు మూడు రోజు ల ముందు జరగాల్సిన మీటింగ్ జరగనివ్వకుండా హరీష్ రావు వ్యూహం పన్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.

ఎమ్మెల్యేకు ఫస్ట్ ఫ్రొటోకాల్,
కార్పొరేషన్ చైర్మన్‌కు రెండోస్థానం
సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నే ఫస్ట్ ఫ్రొటోకాల్ అని, త న భార్య కార్పొరేషన్ చైర్మన్ ఆమెకు ప్రొటోకాల్‌లో రెండోస్థానం లో ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. ప్రొటోకాల్ విషయంలో 60 శాతం, 40 శాతంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు సమ ప్రా ధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించానని పేర్కొన్నారు.

ఆ ఎన్నికల్లో ప్రధాన కమ్యూనిటీ మద్దతు ఇవ్వలేదు
2023 ఎన్నికలకు 6 నెలల ముందు వరకు తనకు పోటీ చేసే ఆలోచన లేదని, కానీ, 2009 నుంచి 2014 వరకు చాలా అభివృద్ధి చేశానని ఆయన తెలిపారు. 2014లో తనకు ప్రధాన క మ్యూనిటీ మద్దతు ఇవ్వలేదని, అందుకే ఓడిపోయానని, ఈ విషయాన్ని ఆ కమ్యూనిటీ ముందే చెప్పిందని ఆయన పేర్కొన్నారు. మీరు అందరికీ సాయం చేస్తారని చెబుతూనే మిమ్మల్ని రాజకీయ కారణంతో ఓడిస్తామని, ఎన్నికల నుంచి తప్పుకోండి అని ఆ కమ్యూనిటీ సలహా ఇచ్చిందన్నారు.

రాజకీయ పోరాటం వేరు, రాజకీయ పరిపాలన వేరు
తన మామకు సంగారెడ్డి గెలిచి గిఫ్ట్ ఇవ్వాలని హరీష్‌రావు కసిగా తీసుకున్నారని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని తనకు కిషన్ సే ట్ ఎన్నికల కు రెండు రోజుల ముందే చెప్పారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాజకీయ పోరాటం వేరు, రాజకీయ పరిపాలన వేరని, పోరాటం చేసి అధికారం సాధించాక దేని కోసం అయితే పోరా టం చేస్తామో దానిని అమలు చేయాలని జగ్గారెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News