Thursday, January 23, 2025

తెలంగాణలో పాదయాత్ర చేస్తా.. పర్మిషన్ ఇవ్వండి: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

మాణికరావు ఠాక్రేకు జగ్గారెడ్డి లేఖ

సంగారెడ్డి: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణికరావు ఠాక్రేకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో పాదయాత్ర చేయడానికి జగ్గారెడ్డి అనుమతి కోరారు. జోడో యాత్రకు కొనసాగింపుగా పాదయాత్రకు అనుమతి కోరినట్లు సమాచారం. 47 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయడానికి అనుమతివ్వలన్నారు.

Also Read: సోనియా గాంధీ ‘విషకన్య’ : బసన్‌గౌడ పాటిల్ యత్నల్

హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్ లో పాదయాత్ర చేస్తానని లేఖలో కోరారు. అటు జనగామలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో ఇవాళ ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంఎల్ఎ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వర్గీయుల మధ్య తోపులాట జరగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పాదయాత్రల జోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News