Sunday, December 22, 2024

కోమటిరెడ్డి పార్టీకి నష్టం జరిగేలా మాట్లాడలేదు: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ మాణిక్‌రావ్ థాక్రేకు రాష్ట్రంలో పార్టీ బలం, బలహీనతలను వివరించినట్టుగా సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హైదర్‌గూడ ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌లో మాణిక్‌రావ్ థాక్రేతో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. అనంతరం జగ్గారెడ్డి మీడి యాతో మాట్లాడుతూ థాక్రేను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు. థాక్రే అనుభవం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడుతుందన్నారు.

కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ నష్టం కలిగించేలా మాట్లాడలేదని చెప్పారు. ఆయన మాటలను వక్రీకరించారని, మాట్లాడింది ఒకటైతే మీడియాలో మరొకటి వచ్చిందన్నారు. ఎవరు ఏం మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగదని చెప్పుకొచ్చారు. బిఆర్‌ఎస్, బీజేపీలను ఎదుర్కో వడంతో పాటుగా రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంపై థాక్రేతో సమాలోచనలు చేసినట్టుగా చెప్పారు. థాక్రేతో భేటీలో పార్టీ అంతర్గత విషయాలేవీ చర్చకు రాలేదని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. తన పాదయాత్ర రూట్ మ్యాప్‌ను కూడా త్వరలోనే తెలియజేస్తానని జగ్గారెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News