Sunday, December 22, 2024

మెగాస్టార్ చిరంజీవిపై జగ్గారెడ్డి ఫైర్

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లా చట్టాలు తెచ్చి రైతుల చావులకు కారణమైన ప్రధాని మోడీని చిరంజీవి అభినందించారని, అదే రైతుల క్షేమం కోసం పోరాడిన రాహుల్‌గాంధీకి మాత్రం మద్ధతు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. రైతుల నష్టాలపై సినిమాలు తీసే చిరంజీవి బిజెపి తీసుకొచ్చిన నల్ల చట్టాలపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. రైతుల కష్టాలపై సినిమాలు తీసే మీరు రైతుల ప్రాణాలు తీసిన బిజెపికి ఎందుకు మద్ధతు ఇస్తున్నారని ఆయన నిలదీశారు.

ఇక, బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కెసిఆర్ రూ.7లక్షల కోట్లు అప్పు చేశారని, అందులో అప్పటి మంత్రి హరీష్ రావు భాగస్వామి కాదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ.31 వేల కోట్లు మాఫీ చేసిందని బిజెపి కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి రైతులకు ఏం చేశారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. నల్ల చట్టాలకు తీసుకువచ్చి రైతుల నడ్డి విరిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేయడంతో బిఆర్‌ఎస్, బిజెపి నేతలు షాక్‌లో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇక, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్వీట్లు చేయడానికి మాత్రమే పనికి వస్తాయని ఆయన సెటైర్ వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News