Sunday, December 22, 2024

ఫిన్‌టెక్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న జగ్గల్

- Advertisement -
- Advertisement -

జాగ్గల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్ తమ వినూత్న వ్యయ నిర్వహణ పరిష్కారాల కోసం ఇటీవల మూడు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. గణనీయ వ్యాపార విలువను అందించే అత్యాధునిక వ్యయ నిర్వహణ పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో మరియు అమలు చేయడంలో జాగ్గల్ యొక్క అత్యుత్తమ విజయాలను ఈ అవార్డులు గుర్తించాయి.

అనేక మంది ఈ అవార్డు ల కోసం పోటీ పడగా మార్కెట్ లీడర్‌గా జాగ్గల్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది, BW యొక్క ఫెస్టివల్ ఆఫ్ ఫిన్‌టెక్ అవార్డ్స్ & కాన్‌క్లేవ్ 2024లో “ఫిన్‌టెక్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్” అవార్డుతో గౌరవించబడింది. అదనంగా, ఈ ప్లాట్‌ఫారమ్ 11వ చెల్లింపుల పరిశ్రమ అవార్డ్స్ 2024లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. జాగ్గల్ జటిక్స్ స్పెండ్ అనలిటిక్స్ ప్లాట్‌ఫాం కోసం “బెస్ట్ స్పెండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్”, “బెస్ట్ కార్డ్ ఇనిషియేటివ్” అవార్డు గెలుచుకుంది.

“ సౌకర్యవంతమైన ఏకీకరణ, అధునాతన విశ్లేషణలు, సాటిలేని వినియోగదారు అనుభవాన్ని అందించడం ద్వారా వ్యయ నిర్వహణను విప్లవాత్మకంగా మార్చాలనే మా అంకితభావానికి నిదర్శనం, ఈ అవార్డులు. ఇవి మా బలమైన వ్యూహాన్ని సైతం హైలైట్ చేస్తున్నాయి. జోయెర్ ను విడుదల చేసినప్పటి నుండి, మేము మా భాగస్వామి బ్రాండ్‌ల కోసం సౌకర్యవంతమైన ఇన్‌వాయిస్ ప్రాసెసింగ్ మరియు ఆటోమేషన్‌ను సాధ్యం చేశాము ”అని జాగ్గల్ సీఈఓ రాజ్ ఎన్ అన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News