Saturday, November 23, 2024

రేవంత్ ‘షో’లుచెల్లవు

- Advertisement -
- Advertisement -

Jaggareddy challenge to Revanth reddy

వ్యక్తిగత షో చేస్తున్నాడు.. నేను కూడా చేయగలను
సంగారెడ్డిలో నామీద కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించగలడా? : జగ్గారెడ్డి సవాల్

నాకు షోకాజ్ నోటీసు ఇస్తే
ఏమవుతది, ఇమ్మనండి
అప్పుడు ప్రతిరోజూ రేవంత్ గురించి
మాట్లాడుతా ఉత్తమ్ కుమార్ రెడ్డి
పిసిసి చీఫ్‌గా ఉన్నప్పుడు
హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు 60వేల
ఓట్లు వచ్చాయి రేవంత్ హయాంలో
3వేల ఓట్లకు పడిపోయాయి
రేవంత్ పార్టీని నష్టపరిచాడు
భవిష్యత్తులో ఇంకా నష్ట పరుస్తాడు
వ్యక్తిగత ప్రతిష్ట కోసమే
పాకులాడుతున్నాడు: సోనియా,
రాహుల్‌గాంధీలకు మా సంపూర్ణ
మద్దతు ఉంటుంది

మన తెలంగాణ/హైదరాబాద్: సంగారెడ్డి ఎంఎల్‌ఎ పదవికి తాను రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. అయితే తన పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పోటీ పెట్టి గెలిపించాలని జగ్గారెడ్డి పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఆదివారం నాడు సీనియర్ల సమావేశం ముగిసిన తర్వాత జగ్గారెడ్డి మీడియా తో మాట్లాడారు. పార్టీ అధిష్టానంపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో సో నియాగాంధీ, రాహుల్‌గాంధీలకు తాము సంపూర్ణ మద్ద తు తెలిపామన్నారు. మమ్మల్ని సస్పెండ్ చేయడాని కి మీరెవరు? అంటూ జగ్గారెడ్డి ఆగ్రహం చెందారు. మంత్రి హరీష్‌రావును తన వ్యక్తిగత పనుల కోసం వి.హనుమంతరావు కలిశాడని జగ్గారెడ్డి చెప్పారు.

ఇందులో తప్పేం ఉందన్నారు. హనుమంతరావు కూతురు డాక్టర్ అని, ఆ రోగ్యశాఖ మంత్రిగా ఉన్న హరీష్‌రావుని హనుమంతరా వు కలవడాన్ని కూడా తప్పుబడితె ఎలా అని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టిడిపి వాళ్లు కలవలేదా, టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ వా ళ్లు మంత్రులను కలవలేదా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తమలాంటి నేతలు లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందని జగ్గారెడ్డి ప్ర శ్నించారు. పార్టీలో అందరినీ కలుపుకుపోవాలని జగ్గారెడ్డి కోరారు. రేవంత్‌రెడ్డి భజనపరులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. రేవంత్‌రెడ్డి ఒక్కడే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాడా? అని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఒక్కడే గొప్ప నాయకుడే అయితే సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దింపి గెలిపించాలని ఆయన సవాల్ చేశారు. ఒకవేళ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. అతను కాంగ్రెస్‌లో గొ ప్ప నాయకుడని జగ్గారెడ్డి చెప్పారు.

ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కాదన్నారు. రేవంత్‌రెడ్డి వ్యక్తిగత షో చేస్తున్నాడన్నారు. తాను కూడా వ్యక్తిగత షో చేస్తానని జగ్గారెడ్డి చెప్పారు. షోకాజ్ ఇస్తే ఏమైతదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. షోకాజ్ ఇవ్వనివ్వాలని కోరారు. తనకు షోకాజ్ నోటీసు ఇస్తే.. రేవంత్‌రెడ్డి గురించి ప్రతి రోజూ మాట్లాడుతానని జగ్గారెడ్డి చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిసిసి చీఫ్‌గా ఉన్న సమయంలో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 60 వేల ఓట్లు వచ్చాయన్నారు. రేవంత్‌రెడ్డి పిసిసి చీఫ్‌గా ఉన్న సమయంలో పార్టీ అభ్యర్థికి కేవలం 3 వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి భజనపరులు మర్చిపోయారా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని నష్టపర్చాడన్నారు. అంతేకాదు, భవిష్యత్తులో కూడా పార్టీని ఇంకా నష్టపరుస్తాడని జగ్గారెడ్డి చెప్పారు. వ్యక్తిగత ఇమేజ్ కోసమే రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News