Saturday, December 21, 2024

హైదరాబాద్ తప్పించి వేరే చోట పోటీ చేసే దమ్ముందా? అసద్‌కు జగ్గారెడ్డి సవాల్!

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎంఎల్ జగ్గారెడ్డి శనివారం ఓ సవాల్ విసిరారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం మినహా మరే స్థానం నుంచి అయినా పోటీ చేసే దమ్ముందా? అంటూ జగ్గారెడ్డి సవాల్ చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి దమ్ముంటే హైదరాబాద్ పార్లమెంట్ స్థానంప నుంచి పోటీ చేయాలని సవాల్ చేస్తూ అసద్ చేసిన వ్యాఖ్యలను ఖండించేందుకు శనివారం మీడియా ముందుకు వచ్చిన జగ్గారెడ్డి ఈ సవాల్ విసిరారు.

వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమేనని చెప్పిన జగ్గారెడ్డి.. అందుకోసం పార్టీ అధిష్టానానికి లేఖ రాస్తానని కూడా చెప్పారు. హైదరాబాద్ కాకుండా కనీసం మెదక్‌లో అయినా పోటీ చేసే దమ్ముందా? అని కూడా ఆయన అసద్‌కు సవాల్ చేశారు. కాంగ్రస్ పార్టీ అరుగుల మీద కూర్చున్న చరిత్రను మరిచారా? అంటూ అసద్‌ను ప్రశ్నించిన జగ్గారెడ్డి.. దేశం కోసం త్యాగం చేసిన గాంధీ ఫ్యామిలీకే సవాల్ విసురుతారా? అని అసద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News