- Advertisement -
హైదరాబాద్: ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తనని గౌరవించడంలేదని సంగారెడ్డి ఎంఎల్ఎ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిఎల్‌పిలో కాంగ్రెస్ ఎంఎల్ఎ జగ్గారెడ్డి చిట్‌చాట్ చేశారు. పార్టీ మారాలంటే తనని ఆపేది ఎవరిని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో తనని మాట్లాడనివ్వడంలేదని, అసలు కాంగ్రెస్‌లో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. పార్టీలో జరిగే అన్యాయాలపై ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో హీరోయిజం పని చేయదని, తెలంగాణలో తనని కూడా అభిమానులు ఉన్నారని జగ్గారెడ్డి తెలియజేశారు. కావాలంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండానే రెండు లక్షల మందితో సభ పెడతానని సవాలు చేశారు.
- Advertisement -