వ్యక్తిగత ప్రతిష్ట కోసమే
రేవంత్ పనిచేస్తున్నారు
పార్టీ డైరెక్షన్‌లో నడిచేలా
చూడండి సొంత
జిల్లాలోనూ ఎంఎల్‌సి
అభ్యర్థిని బరిలోకి
దింపలేదు
కాంగ్రెస్ హైకమాండ్‌కు
పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్
జగ్గారెడ్డి లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసి డెంట్ జగ్గారెడ్డి సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోనియాగాంధీ, రా హుల్‌గాంధీలకు సోమవారం లేఖ రాశా రు. టిపిసిసి చీఫ్ రేవంత్‌ని మార్చాలని ఆ లేఖలో కోరారు. పిసిసి చీఫ్‌గా రేవంత్ రెడ్డి ని మీరు నియమించినా తాము కలుపుకు పోవాలని ప్రయత్నించామన్నారు. పార్టీ లై న్‌లో కాకుండా వ్యక్తిగత ఇమేజ్ కోసం రే వంత్ చెప్పారు. రేవంత్‌ని పార్టీ డైరెక్షన్‌లో నడిచేలా చూడాలని ఆ లేఖలో కోరారు. సొంత జిల్లాలోనూ ఎం ఎల్‌సి అభ్యర్థిని బరిలోకి దింపలేని విష యాన్ని జగ్గారెడ్డి లేఖలో గుర్తు చేశారు. రే వంత్‌తో తనకెలాంటి వ్యక్తిగత విభేదాలు లే వన్నారు. పార్టీని బలోపేతం చేయడం కోస మే ఈ లేఖను రాస్తున్నట్లుగా జగ్గారెడ్డి తెలి పారు. రేవంత్ లీడర్‌గా ఎదగాలని అనుకుంటున్నాడని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.
గ్రామస్థాయికి వెళ్లి పనిచేసే ఉద్దేశం రేవంత్‌రెడ్డికి లేదన్నారు. ఎర్రవెల్లిలో రేవంత్‌రెడ్డి సోమవారం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి సమాచారం అందలేదు. ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం విషయమై కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చ జరగని విషయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఏకపక్షంగా రేవంత్‌రెడ్డి కార్యక్రమాలను చేపట్టారని ఆయన విమర్శించారు. ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమానికి సంబంధించి జగ్గారెడ్డికి సమాచారం ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా తప్పుబట్టారు.