హైదరాబాద్: కాంగ్రెస్ లో పార్టీలో ఇంకా అంతర్గత పోరు కొనసాగుతోంది. పార్టీకి నష్టం కలిగిస్తున్నారంటూ సోనియా, రాహుల్ గాంధీలకు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ”లేఖ రాసిన క్షణం నుంచి కాంగ్రెస్ లో నేను లేను. సడెన్ గా వచ్చి లాబియింగ్ చేస్తే ఎవరైనా పిసిసి కావొచ్చు. నాపై కోవర్ట్ అనే నిందలు వేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి పరువు కాపాడిన వ్యక్తిని నేను. పార్టీ పరువు కాపాడిన నేనున కోవర్టా?.. హుజూరాబాద్ లో పార్టీ పరువు తీసినవారు కోవర్టా?. తప్పులు సరిదిద్దుకోమని చెప్తే కోవర్ట్ అని ముద్రవేశారు. గతంలో కూడా కాంగ్రెస్ లో వర్గపోరు ఉండేది. అది ఎంతో హుందాగా ఉండేది.. ఇప్పుడు అలా లేదు. త్వరలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా. కాంగ్రెస్ నుంచి చాలా మంది బయటకు వెళ్లారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి.. ‘జగ్గారెడ్డి వ్యవహారం టి కప్పులో తుఫాన్ లాంటిది. ఇది అంతర్గత సమస్య.. మేం పరిష్కరించుకుంటాం’ అని అన్నాడు.
Jaggareddy writes letter to Sonia Gandhi