Saturday, December 21, 2024

విదేశాల నుంచి వచ్చి… భార్యను చంపి… భర్త పురుగుల మందు తాగి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: గల్ఫ్ నుంచి వచ్చిన మర్నాడు భర్త భార్యను చంపిన సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తొంబర్రావు పేట గ్రామంలో లింగం(50)-రాయంచు జల(45) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కూమార్తె ఉన్నారు. కూతురుకు పెళ్లి చేయగా ఉపాధి నిమిత్తం లింగం తన కుమారుడితో కలిసి గల్ఫ్‌కు వెళ్లాడు. ఆదివారం గల్ఫ్ నుంచి తన సొంతూరుకు వచ్చాయి. భార్య రాయంచు జల గాఢ నిద్రలోకి జారుకున్న తరువాత ఆమె తలపై పారాతో కొట్టి చంపేశాడు. అనంతరం పురుగుల మందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జగిత్యాలలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News