Wednesday, January 22, 2025

మహా నేత జగ్జీవన్ రామ్

- Advertisement -
- Advertisement -

1934లో జగ్జీవన్‌రామ్ కలకత్తాలో అఖిల భారతీయ రవిదాస్ మహాసభను స్థాపించారు. దళితుల సాంస్కృతిక ‘కులగురు వు’ అయిన ‘గురు రవిదాస్’ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పలు జిల్లాల్లో రవిదాస్ సమ్మేళనాలను నిర్వహించారు. సాంఘిక సంస్కరణ కోసం ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ సంఘాన్ని స్థాపించారు. ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరా డుతూ, మరోవైపు సాంఘిక సంస్కరణ కోసం రాజకీయ ప్రాతినిధ్యం వహించిన గొప్ప మేధావి. డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కోసం తీవ్రంగా కృషిచేశారు.

భారత దేశ స్వరాజ్య ఉద్యమంతో పాటు, ఈ దేశ పునర్నిర్మాణంతో ముడిపడినది జగ్జీవన్ రామ్ జీవితం. 1908 ఏప్రిల్ 5వ తేదీన బీహార్ రాష్ట్రంలోని షాబాద్ జిల్లాలోని చంద్వా గ్రామంలో జన్మించారు. అంటరాని, అస్పృశ్యత కులంలో పుట్టి పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు మెరుగైన విద్యార్థిగా, మేధావిగా రాణించారు. జగ్జీవన్ రామ్ 1922లో పాఠశాలలో చదువుతున్నప్పుడు కుండ లో నీటిని తాగడానికి ఆధిపత్య కులాల విద్యార్థులు నిరాకరించడంతో మొదటిసారి అంటరానితనం, అణచివేతకు గురైనాడు. దళితులకు పాఠశాలల్లో ప్రత్యేక నీటి కుండను ఏర్పాటు చేయడంతో సహించలేక ప్రతి కుండను పగులగొట్టి నిరసన వ్యక్తం చేశారు.

కుల వివక్షపై ఆగ్రహంతో జగ్జీవన్ రామ్ స్కూల్లో అందరి కన్నా గొప్ప ప్రతిభను కనబరిచి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అనంతరం కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బిఎస్‌సి పట్టభద్రుడయ్యారు. జగ్జీవన్‌రామ్ కలకత్తా వచ్చిన ఆరు నెలల్లోనే విల్లింగ్టన్ స్క్వేర్‌లో ముప్పై వేల మంది కార్మికులను కూడగట్టి భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ విజయంతో జగ్జీవన్‌రామ్ సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి జాతీయ నాయకుల దృష్టికి ఆకర్షించారు. కమ్యూనిస్టు మేనిఫెస్టో, పెట్టుబడిదారీ గ్రంథాలతో పాటు ఇతర సోషలిస్టు సాహిత్యం అధ్యయనం చేశారు. బ్రిటిష్ వలసవాద సంకెళ్ళు తెంపి, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాలని, సామాజిక సమానత్వం నిర్మించాలని విద్యార్థి దశలోనే సంకల్పించుకున్నారు. 1934లో జగ్జీవన్‌రామ్ కలకత్తాలో అఖిల భారతీయ రవిదాస్ మహాసభను స్థాపించారు.

దళితుల సాంస్కృతిక ‘కులగురువు’ అయిన ‘గురు రవిదాస్’ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పలు జిల్లాల్లో రవిదాస్ సమ్మేళనాలను నిర్వహించారు. సాంఘిక సంస్కరణ కోసం ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ సంఘాన్ని స్థాపించారు. ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూ, మరోవైపు సాంఘిక సంస్కరణ కోసం రాజకీయ ప్రాతినిధ్యం వహించిన గొప్ప మేధావి. డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కోసం తీవ్రంగా కృషిచేశారు. ఇంతవరకు దళిత జాతి అభ్యున్నతిలో ఆయన కృషి మరువలేము. తన రాజకీయ జీవితం 28 ఏళ్ళ వయస్సులోనే మొట్టమొదట 1936లో బీహార్ శాసనసభకు ఎంఎల్‌ఎగా గెలవడంతోనే ప్రారంభించారు. అంతేకాకుండా 1937లో బీహారు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ నుంచి 14 రిజర్వుడు స్థానాలకు అభ్యర్థులను పోటీకి దింపి గెలిపించారు.

దీంతో ఒక రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా ఎదిగారు. అప్పుడు తమతో చేతులు కలపమని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. 1942 లో జగ్జీవన్ రామ్ బొంబాయిలో అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జగ్జీవన్‌రామ్ అరెస్టు అయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వ అణచివేతల్ని ఖండిస్తూ అనేక సభలు, సమావేశాలు, ర్యాలీను నిర్వహించారు. కానీ అంబేడ్కర్ స్వాతం త్య్రం సిద్ధించే లోపే తన జాతి బానిస సంకెళ్ళ నుంచి విముక్తి కావాలని కోరుకున్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ 1946 మధ్యంతర ప్రభుత్వంలో కార్మిక శాఖమంత్రిగా, కేంద్ర కేబినెట్ మంత్రిగా, దేశ ఉప ప్రధాన మంత్రి వంటి గొప్ప పదవులు అనుభవించారు. దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారని పేరు తెచ్చుకున్నారు. కానీ దళిత జాతి అభ్యున్నతిలో తన ముద్ర వేయలేకపోయారు.

వాస్తవంగా ఆయన ఈ దేశానికి ప్రధాని కావాల్సిన వ్యక్తి. కులం అనే నీడతో ఉప ప్రధాని పదవికే పరిమితమయ్యారు. అయినా కేంద్ర వ్యవసాయ ఆహార శాఖమంత్రిగా దేశంలోని ఆహార సమస్యల పరిష్కారానికై హరిత విప్లవానికి నాంది పలికారు. 1969 లో అధికార కాంగ్రెస్ పార్టీకి జగ్జీవన్‌రామ్ అధ్యక్షుడయ్యారు. 1977లో ఇందిరా గాంధీ నియంతృత్వ విధానంతో విభేదించి, ‘ప్రజాస్వామ్య కాంగ్రెస్’ (కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ) అనే పార్టీని స్థాపించారు. తదుపరి దానిని జనతా పార్టీలో కలపారు. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా జనతా పార్టీ ప్రభుత్వంలో జగ్జీవన్‌రామ్ కేంద్ర రక్షణ శాఖా మంత్రిగా విధులు నిర్వర్తించారు. అప్పుటి బంగ్లాదేశ్ యుద్ధంలో గెలుపొందే విధంగా కృషి చేశారు. 1986 జూలై 6వ తేదీన బాబూజీ భౌతికంగా మనల్ని వీడారు, యావత్తు భారతజాతి ఘనంగా నివాళుర్పించింది. స్వాతంత్యం సిద్ధించి 76 వసంతాలైనప్పటికీ దళితుల బతుకుల్లో ఇప్పటికీ మార్పు రాలేదు. ఇప్పటికైనా దళిత నేతలు మనువాద అగ్రకుల పార్టీల నుంచి బయటకు వచ్చి స్వశక్తితో రాజ్యాధికారం వైపు ప్రయాణించాలి.

సంపతి రమేష్ మహారాజ్
7989579428

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News