Monday, December 23, 2024

విద్యుత్‌శాఖలో ఘనంగా బాబూజగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

Jagjivan Ram Jayanti celebrations in power sector

మన తెలంగాణ,సిటీబ్యూరో: ప్రముఖ స్వాతంత్య్రయోధుడు, సమతావాది ,మాజి ఉప ప్రధాని డాక్టర్‌బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు మంగళవారం దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ సీఎండి జి. రఘుమారెడ్డి విచ్చేసి బాబూ జగ్జీవన్ రామ్ ఫోటోకు పూల మాల వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనునిత్యం దళితుల అభివృద్దికి పాటు, పడి దళితులు సమాజంలో అందరితో పాటు సమానంగా జీవించాలని ఆశించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సంవత్సరం వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో విద్యుత వినియోగంతో భారీగా పెరుగుతోందన్నారు.

ప్రస్తుతం విద్యుత్ వినియోగం రాష్ట్రవ్యాప్తంగా8792 మెటావాట్ల గరిష్ట డిమాండ్ ఉండంతో 178.83 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదువుతున్నట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ 3158 వెగావాట్ల గరిష్ట డిమాండ్ ఉండగా 67.01మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగ నమోదైనట్లు తెలిపారు.

రాబోవు రోజుల్లో ఎండల ఉదృతి కారణంగా మరింత విద్యుత్ డిమాండ పెరిగే అవకాశం ఉండటంతో సరఫరాలో ఎటువంటి అంతరాయలు లేకుండా సంస్థ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎటువంటి అంతరాయాలు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరక్టర్లు సిహెచ్.మదన్ మోహన్‌రావు, ఎస్, స్వామి రెడ్డి పి. నరసింహరావు, జి.గోపాల్, సీజీఎంలు పాండ్యా నాయక్, సాయిబాబా, మజీదుల్లాఖాన్, ఎస్‌ఈ శ్రీనివాసరావు,ఇతర ఉన్నాతాధికారులతో పాటు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News