Saturday, March 1, 2025

సౌదీలో జగిత్యాల వ్యక్తి హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని సౌదీలో రూమెంట్ హత్య చేశాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం…. కథలాపురం మండలం పోసానిపేట గ్రామానికి చెందిన గుంట హనుమంతు బతుకుదెరువు కోసం సౌదీ ఆరేబియాకు వెళ్లాడు. హనుమంతు మరో వ్యక్తితో కలిసి జుబెల్‌లో ఓ రూమ్ తీసుకొని ఉంటున్నాడు. ఓ కంపెనీలో లేబర్ పని చేస్తూ ఇంటికి డబ్బులు పంపించేవాడు. గదిలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరగడంతో హనమంతు హత్య చేశారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలిసిన వెంటనే మృతుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పోసానిపేట గ్రామం విషాదంలో మునిగిపోయింది. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News