Sunday, January 19, 2025

యువతి ఇంటికి వెళ్లి కత్తితో దాడి… ప్రేమోన్మాది మృతి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: పెళ్లి చేసుకోవాలని ఓ ప్రేమోన్మాది యువతిని వేధించడంతో పాటు ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు బండరాయితో అతడిని కొట్టడంతో ఘటనా స్థలంలోనే యువకుడు చనిపోయిన సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తక్కళ్లపల్లి గ్రామంలో రాజేశ్- సతవ్వ అనే దంపతులు నివసిస్తున్నారు. రాజేశ్ జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. ఈ దంపతులకు కూతురు ఉంది. తాతతో కలిసి యువతి, తల్లి ఉంటున్నారు. పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన బోగ మహేశ్ గత కొన్ని రోజుల నుంచి సత్తవ్వ కూతురు వెంటపడి పలుమార్లు వేధించాడు. వేధింపులు ఎక్కువ కావడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు.

జైలు నుంచి విడుదలైన తరువాత అతడిలో మార్పురాలేదు. నాలుగు రోజుల క్రితం యువతి కాలేజీకి వెళ్తుండగా మార్గంమధ్యలో ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. దీంతో మళ్లీ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహేశ్ సోమవారం నేరుగా యువతి ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేస్తుండగా నర్సయ్య, సత్తవ్వ అడ్డుకున్నారు. ఈ ఘర్షణ పడుతుండగా మహేశ్ కిందపడిపోవడంతో అక్కడ ఉన్న రాయితో అతడిపై తలపై ఆమె కుటుంబ సభ్యులు కొట్టారు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మహేశ్ దుర్మరణం చెందాడు. తీవ్రంగా గాయపడిన నర్సయ్య, సత్తవ్వ, యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువతి తాత పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మహేశ్ తండ్రి ఫిర్యాదు చేయడంతో యువతి అన్న, తల్లి, తాతలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక సిఐ దామోదర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News