Friday, April 4, 2025

జామ్‌నగర్‌లో కూలిన జాగ్వార్ యుద్ధ విమానం..

- Advertisement -
- Advertisement -

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జాగ్వార్ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ విషయాన్ని భారత రక్షణ వర్గాలు తెలిపాయి. జామ్‌నగర్‌లోని సువర్ద సమీపంలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. విమానంలో సాంకేతికత లోపం కారణంగా పొలంలో కుప్పకూలినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎయిర్ పోర్ట్ అధికారులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

“భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం జామ్‌నగర్‌లో కూలిపోయింది. ఒక పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.. మరొకరి కోసం వెతుకుతున్నారు” అని ఎస్పీ ప్రేమ్‌సుఖ్ దేలు అన్నారు. కూలిపోయిన విమానం సాధారణ శిక్షణా కార్యక్రమంలో ఉన్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. ఈ ఘటనపై కోర్టు విచారణకు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News