Thursday, December 26, 2024

టాటా టెక్నాలజీస్‌తో జాగ్వార్ ల్యాండ్ రోవర్ భాగస్వామ్యం..

- Advertisement -
- Advertisement -

ముంబై: జాగ్వార్ ల్యాండ్ రోవర్ పారిశ్రామిక వ్యూహం డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడానికి గాను జాగ్వార్ ల్యాండ్ రోవర్ గ్లోబల్ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, డిజిటల్ సేవల సంస్థ అయిన టాటా టెక్నాలజీస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మొదటి దశలో యూకే ప్రధాన ఉత్పత్తి కేంద్రా లు ఉంటాయి. తదనంతరం ఈ పరిష్కారాలు ఇతర ప్రపంచ కేంద్రాలకూ విస్తరించబడతాయి.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ తయారీ, లాజిస్టిక్స్, సప్లై చైన్, ఫైనాన్స్, కొనుగోలు మాడ్యూల్‌లను పరివర్తింపజే యడానికి వీలుగా పలు విభాగాల నుంచి ఒక్క సింగిల్ సోర్స్ కు డేటాను, నాలెడ్జ్ ను తీసుకురావడం ద్వా రా ఎండ్-టు-ఎండ్ ఇంటిగ్రేటెడ్ ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ERP)ని టాటా టెక్నాలజీస్ అందజేస్తుంది.

టాటా టెక్నాలజీస్ అత్యుత్తమ సాఫ్ట్‌ వేర్ నూతన వినియోగదారు ఇంటర్‌ఫేస్ అనేది కార్యకలాపాలలో స్థిరత్వాన్ని పెంచుతుంది. బృందాల మధ్య, సరఫరాదారులకు విజిబిలిటీని మెరుగుపరుస్తుంది. అంతిమం గా కంపెనీ కొత్త వాహనాలకు మరింత చురుకైన, వేగవంతమైన మార్కెట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ప్రధాన వ్యాపార విభాగాలలో సమాచారాన్ని క్రమబద్ధీకరించడానికి, ఏకీకృతం చేయడానికి ఈఆర్పీ కీలకం. వివిధ విభాగాల్లో డేటా, నిర్వహణ ప్రక్రియల కోసం ఒక ప్రత్యేక హోమ్ ను సృష్టించడం అనేది వ్యాపారం ఎ లా పనిచేస్తుందనే పరివర్తనకు ప్రాథమికమైనది. ఈఆర్పీ వ్యవస్థలు తక్షణమే ఇన్ సైట్స్ ను అందించడాని కి డేటాను సమగ్రపరచడం, నిల్వ చేయడం, ఇంటర్ ప్రిట్ చేయడం వంటివి చేయగలవు. సమస్యలు, సవా ళ్లు, అవకాశాలకు చురుగ్గా, సమయానుకూలంగా స్పందించడంలో కంపెనీలకు సహాయపడతాయి.

ఈ ఒప్పందం కంపెనీ రీఇమాజిన్ వ్యూహంలో భాగంగా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలతో జాగ్వార్ ల్యాండ్ రోవ ర్ అలైన్ మెంట్ ను మరింత ముందుకు తీసుకువెళుతుంది. టాటా టెక్నాలజీస్ 11,000 మంది ఉద్యోగు లు, అనేక దేశాలలో క్లయింట్‌లతో కూడిన గ్లోబల్ నెట్‌వర్క్‌ తో ఉత్పత్తి, డిజిటల్ ఇంజనీరింగ్‌లో 30 సంవ త్సరాల కంటే ఎక్కువ అనుభవాన్ని అందిస్తుంది.

ఈ సహకారంపై మాట్లాడుతూ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండస్ట్రియల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బార్బరా బెర్గ్‌ మీర్ ఇలా వ్యాఖ్యానించారు:

“టాటా టెక్నాలజీస్‌తో భాగస్వామ్యం అనేది భవిష్యత్తుకు, మా పరివర్తన లక్ష్యాలకు అవసరమైన సామర్థ్యం, వినియోగాన్ని అందించడానికి వీలుగా మా ప్రధాన ఈఆర్పీ మౌలిక సదుపాయాల పరివర్తనను వేగవంతం చేయడానికి వీలు కల్పిస్తుంది. మా సరఫరా గొలుసు, విస్తృత పారిశ్రామిక కార్యకలాపాల కోసం లక్ష్యాలను సాధించడంలో మాకు సహాయం చేయడానికి టాటా గ్రూప్‌లో భాగమైన శక్తిని కూడా ఇది ప్రదర్శిస్తుంది.’’

టాటా టెక్నాలజీస్ ఎండీ, సీఈఓ వారెన్ హారిస్ ఇలా వ్యాఖ్యానించారు.

‘‘జాగ్వార్ ల్యాండ్ రోవర్‌తో ఈఆర్పీ పరివర్తన సహకారం అనేది టాటా టెక్నాలజీస్‌తో దాదాపు రెండు దశా బ్దాల బంధంలో మరో మైలురాయి. జాగ్వార్ ల్యాండ్ రోవర్ మాపై ఉంచిన నమ్మకం ఆటోమోటివ్ ఇంజినీ రింగ్, డిజిటల్ సొల్యూషన్ లు అందించడంలో మా దీర్ఘకాల నైపుణ్యాన్ని ధ్రువీకరిస్తుంది. ఈ సహకారం జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కి వినూత్నమైన, సుస్థిరమైన వాహనాలను నిర్మించడంలో, నూతన తరం డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించి మార్కెట్‌కి వేగంగా చేర్చడాన్ని సాధించడంలో సహాయపడుతుందని మేం విశ్వసిస్తున్నాం. జాగ్వార్ ల్యాండ్ రోవర్‌తో ఇప్పటికే ఉన్న మా అనుబంధాన్ని బలోపేతం చేయడం పట్ల మేం సంతోషి స్తున్నాం, మా డిజిటల్ ఇంజనీరింగ్ సామర్థ్యాలను అమలు చేయడానికి, వారి కొత్త తరం వాహనాలను ప్రారంభించడంలో సహాయం చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం.’’

జాగ్వార్ ల్యాండ్ రోవర్ చీఫ్ డిజిటల్ & ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆంథోనీ బాటిల్ ఇలా వ్యాఖ్యానించారు:

‘‘రీఇమేజిన్ లో భాగంగా వ్యాపారం మరింత చురుగ్గా మారడంలో, టెక్ లీడర్‌గా తన సామర్థ్యాన్ని నెర వేర్చడంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ డిజిటల్ పరివర్తన కీలక పాత్ర పోషిస్తుంది. మా డిజిటల్ 2024 ప్రోగ్రామ్‌ లో భాగంగా, మేం క్లౌడ్-నేటివ్ డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌కి మారుతున్నాం, టాటా టెక్నాలజీస్‌తో భాగస్వామ్యం ఆ ప్రయాణంలో మరో ముఖ్యమైన అడుగు వేయడానికి మాకు వీలు కల్పిస్తుంది.’’

స్టాండర్డ్ ఆపరేటింగ్ మోడల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, కంపెనీ డిజిటల్ పరివర్తన వ్యూహంలో భాగం గా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆర్కిటెక్చర్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి టాటా టెక్నాలజీస్ ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌ వేర్‌తో SAP S/4 HANA, SAP BTPలను అనుసంధానిస్తుంది. లెగసీ ERP సొల్యూషన్‌ల నుండి ఆధునిక క్లౌ డ్-ఆధారిత సిస్టమ్‌కు మారడాన్ని SAP S/4 HANA సాఫ్ట్‌ వేర్ ప్యాకేజీ సూచిస్తుంది, కార్యాచరణ సామ ర్థ్యాలు, సుస్థిరత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News