- Advertisement -
న్యూఢిల్లీ : జహంగీర్‌పురి మతపర హింసాత్మక సంఘటనల కేసులో కీలక నిందితుడని పశ్చిమబెంగాల్‌లో గురువారం అరెస్టు చేశారు. నిందితుడు ఫరీద్ అలియాస్ నీటుగా గుర్తించారు. మతపరమైన అల్లర్లలో నిందితుడు ప్రధాన పాత్ర వహించాడని, పశ్చిమబెంగాల్ లోని తమ్లుక్ గ్రామంలో అతని మేనత్త ఇంటివద్ద పట్టుబడ్డాడని అధికార వర్గాలు వెల్లడించాయి. అనేక బృందాలు పశ్చిమబెంగాల్‌లో ఈమేరకు గాలించినట్టు చెప్పారు. అల్లర్లు జరిగిన తరువాత నిందితుడు పరారయ్యాడని, అప్పటినుంచి ఒకచోట ఉండకుండా తరచుగా స్థలాలు మారుస్తూ పశ్చిమబెంగాల్ అంతా తిరుగుతున్నట్టు కనుగొన్నామని తెలిపారు. నిందితునిపై దోపిడీ, లాక్కోవడం, దొంగతనం, ఆయుధ చట్టం తదితర కేసులతో మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయని, 2010 నుంచి జహంగీర్‌పురిలో అతను హిస్టరీ షీటర్‌గా పోలీస్ రికార్డులో ఉన్నాడని పేర్కొన్నారు.
- Advertisement -