Monday, December 23, 2024

వారు నడుస్తున్న శవాల వంటి వారు: సంజయ్ రౌత్

- Advertisement -
- Advertisement -

Sanjay Raut

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తాజాగా రిబెల్  ఎంఎల్ఏలను ఉద్దేశిస్తూ ఇమామ్ అలీ మాటలను ట్వీట్  చేశారు.   “జహాలత్ (విద్య లేకపోవడం) ఒక రకమైన మరణం , ‘జాహిల్’ (చదువులేని) వ్యక్తులు నడుస్తున్న శవాల వంటి వారు” అని ఇమామ్ అలీ మాటలని ఉటంకించారు.

 మీడియా ప్రతినిధులతో సోమవారం మాట్లాడిన రౌత్, “వారి శరీరాలు సజీవంగా ఉన్నాయి, కానీ వారి ఆత్మ చనిపోయాయి, ఇది మహారాష్ట్రలో అనుకుంటున్నది, నేను ఏమి తప్పు చెప్పాను? 40 సంవత్సరాలు పార్టీలో ఉండి, ఆపై పార్టీ నుంచి తొలగిపోయారు, అంటే వారి ఆత్మలు చచ్చిపోయాయి, వారిలో  మిగిలిందంటూ ఏమీ లేదు, ఇవి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా చెప్పిన మాటలు. నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనకలేదు, నేను నిజం మాత్రమే చెప్పాను” అన్నారు. ఇదిలావుండగా, మహారాష్ట్రలో ఎంవిఏ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సంక్షోభం నేపథ్యంలో  రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించడానికి భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర యూనిట్ కోర్ కమిటీ సోమవారం సమావేశమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News