Monday, January 20, 2025

జగన్ పాలనలో వ్యవస్థలు నాశనం: జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: సిఎం జగన్ పాలనలో వ్యవస్థలు నాశనమవుతున్నాయని జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ తెలిపారు. విజయవాడలో జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ మీడియాతో మాట్లాడారు. చంద్రన్న పెళ్లి కానుక సాయం పెంచుతామని జగనే చెప్పారని, వైఎస్‌ఆర్ పెళ్లి కానుక అని పేరు మార్చారు తప్ప పెంచింది ఏమీ లేదని దుయ్యబట్టారు. ఎంత మందికి సాయం చేశారో చూస్తే ఆ సంఖ్య సున్నా ఎద్దేవా చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇవ్వకుండా వైసిపి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. పెళ్లికానుక కింద డబ్బులు ఇచ్చే బాధ్యత తాము తీసుకుంటామని, ప్రజలు దశ యాప్ ద్వారా తమని సంప్రదించాలని కోరారు. జివొ ఇచ్చిపథకాలు అందించకపోతే వారి కోసం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read: మనిషిని పోలిన ఎలుగుబంటి(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News