Wednesday, January 22, 2025

ఆస్కార్ బరిలో రెండు సౌత్ సినిమాలు

- Advertisement -
- Advertisement -

Jai Bhim, Marakkar Movies Nominated for Oscar

 

ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్ విదేశీ చిత్రం కేటగిరిలో రెండు భారతీయ చిత్రాలు నామినేట్ కావడం విశేషం. సూర్య హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ తమిళ చిత్రం ‘జైభీమ్’, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన చారిత్రక చిత్రం ‘మరక్కార్ : అరబిక్కడలిండే సింహం’ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. సూర్య ‘జైభీమ్’ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇటీవల ఈ సినిమాలోని ఒక సన్నివేశాన్ని ఆస్కార్స్ యూ ట్యూబ్ ఛానల్ వారు ప్రసారానికి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ బెస్ట్ మూవీ కేటగిరికి నామినేట్ అయినట్టు అధికారికంగా ప్రకటించారు. మోహన్ లాల్ నటించిన ‘మరక్కార్ : అరబిక్కడలిండే సింహం’ చిత్రాన్ని చారిత్రక కథాంశంతో దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించారు. 16వ శతాబ్దంలో ఇండియన్ నేవీ ఆఫీసర్‌గా పనిచేసిన కుంజాలీ మరక్కార్ జీవిత కథగా ఈ సినిమా రూపొందింది. పాన్ ఇండియా కేటగిరిలో పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఆస్కార్ కు నామినేట్ అయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News