Monday, December 23, 2024

జైభీమ్ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ అరెస్టు!

- Advertisement -
- Advertisement -

విజయవాడ: జై భీమ్ పార్టీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఆర్5 జోన్‌కు వ్యతిరేకంగా తలపెట్టిన పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు. ‘న్యాయం కోసం నేను సైతం’ పేరిట శనివారం విజయవాడ నుంచి అమరావతి అంబేడ్కర్ స్మృతి వనం వరకు పాదయాత్ర చేయాలని ఆయన సంకల్పించారు. ఉదయం శ్రావణ్ బసచేసిన హోటల్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. అరెస్టు చేసిన ఆయన్ను పోలీసులు భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసుల తీరును శ్రావణ్ కుమార్ ఖండించారు. అమరావతి రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా పాదయాత్ర చేయాలని నిర్ణయించామని, పోలీసులు అన్యాయంగా తనను అరెస్టు చేశారని అన్నారు. తన అక్రమ అరెస్టుకు నిరసనగా ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. రైతులకు మద్దతు ఇవ్వడమే తన నేరమా? అని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News