Saturday, December 21, 2024

లైఫ్ టైమ్ సెలబ్రేట్ చేసుకునేలా ‘జై హనుమాన్’.. పోస్టర్ మామూలుగా లేదుగా

- Advertisement -
- Advertisement -

మనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా. ఈ సినిమా దాదాపు రూ.30 కోట్లతో తెరకెక్కగా.. ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీతో మరోసారి తెలుగు సినిమాకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

బధవారం శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ వదిలిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. శ్రీరాముడి చేతిలో హనుమాన్ చెయి వేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ప్రేక్షకులందరికీ ప్రామిస్ చేస్తున్నా.. మునుపెన్నడూ లేని అనుభూతిని ఇస్తానని, లైఫ్ టైమ్ సెలబ్రేట్ చేసుకునేలా సినిమా తీసుకొస్తానని తెలిపారు.

కాగా, హనుమాన్ ఎండింగ్ లో శ్రీరాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందని విభీషణుడు అన్న డైలాగ్.. ఇప్పుడు జైహనుమాన్ కోసం అందరూ ఎదురుచూసేలా చేసింది. ఇంతకీ హనుమాన్, రాముడికి ఇచ్చిన మాట ఎంటి? అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. జై హనుమాన్ సినిమా 2025లో భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News