Monday, January 20, 2025

‘జై హనుమాన్’ ప్రీ పొడ్రక్షన్ వర్క్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను–మాన్ అన్ని ప్రాంతాలలో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూనే వుంది. ఇక సోమవారం అయోధ్యరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’ ప్రీ పొడ్రక్షన్ వర్క్‌ను దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రారంభించారు. ఈ సీక్వెల్‌లో ఓ స్టార్ హీరో ఆంజనేయ స్వామి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని 2025లో విడుదల చేసేందుకు ఫిల్మ్‌మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ‘హను-మాన్’ చిత్రం గ్రాండ్‌గా సెకండ్ వీకెండ్ రన్ ని పూర్తి చేసుకొని 200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో ఈ చిత్రం ఐదో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో హయ్యస్ట్ గ్రాస్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. లిమిటెడ్ రిలీజ్, మినిమమ్ టికెట్ ప్రైస్ అయినప్పటికీ, హను–మాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నార్త్‌లో కూడా అద్భుతంగా దూసుకుపోతోంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం హను–మాన్ సినిమా జోరు ఇంకా బలంగా ఉండబోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News