Wednesday, January 22, 2025

భారత్ జోడో యాత్రతో కొత్త ఊపు వచ్చింది: జైరామ్ రమేష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొత్త ఊపువచ్చిందని, భారత్ జోడో యాత్ర రాష్ట్రనేతల్లో విశ్వాసం నింపిందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ తెలిపారు. బిఆర్‌ఎస్‌కు బిజెపి బీటీమ్‌గా మారిందని దుయ్యబట్టారు. తెలంగాణ బిల్లు పాస్ చేసే సమయంలో పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ ఎంపిలు లేరని ధ్వజమెత్తారు. ఉద్యోగాల కోసమే తెలంగాణ ఏర్పడిందని, నిరుద్యోగ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయని, తెలంగాణలో సామాజిక న్యాయం ఎక్కడ కనిపించడం లేదని, కెసిఆర్ కుటుంబానికి మాత్రమే న్యాయం జరిగిందని జైరామ్  విమర్శలు గుప్పించారు. బిఆర్‌ఎస్‌కు బై బై చెప్పే రోజు వస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు కారును వదిలించుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని జైరామ్ హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు తెలంగాణకు చారిత్రాత్మకమైనవన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News