Friday, December 20, 2024

మేము రాముడి భక్తులం…. మతంతో రాజకీయం చేయం: జైరామ్ రమేశ్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: రాముడిని ఆరాధిస్తామని, రాముడి పేరుతో తాము వ్యాపారం, రాజకీయం చేయమని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ తెలిపారు. మతాన్ని బిజెపి అడ్డంపెట్టుకొని రాజకీయం చేయడంతో రెండు దిగజారిపోయాయని పేర్కొన్నారు. అయోధ్యలో జనవరి 22న రామమందిరం వేడుక రాజకీయంగా జరిగిందని, రాజకీయ వ్యక్తి కోసం జరిగిందని ధ్వజమెత్తారు.

దేశ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలను గడపగడపకు తీసుకెళ్లేలా ఎన్నికల ప్రచారానికి జైరామ్ రమేశ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎనిమిది కోట్ల గ్యారెంటీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేస్తున్నామని, తమకు ముగ్గురు సూపర్ స్టార్ కంపెయినర్లు ఉన్నారని వివరించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News