Monday, December 23, 2024

భారత చమురు దిగుమతులను సమర్థించిన జైశంకర్

- Advertisement -
- Advertisement -
యూరోపియన్ యూనియన్ విధానాన్ని తప్పుపట్టిన విదేశాంగ మంత్రి

న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా నుండి భారతదేశం చమురు దిగుమతులను సమర్థించారు, జర్మనీ విదేశాంగ మంత్రి – అన్నాలెనా బేర్‌బాక్‌తో సమావేశమయ్యాక యూరోపియన్ యూనియన్‌ను విమర్శించారు. రష్యా నుంచి భారత్‌ కంటే ఈయూ 6 రెట్లు అధికంగా చమురును దిగుమతి చేసుకున్నదని విదేశాంగ మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. యూరప్ తన ఇంధన అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి భారతదేశాన్ని మరేదో  చేయమని కోరుతోంది,   దానికి ఎంపిక చేసే హక్కు లేదని డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి చాలా ముందే భారత్, రష్యా మధ్య వాణిజ్యాన్ని విస్తరించే చర్చలు ప్రారంభమయ్యాయని భారత విదేశాంగ మంత్రి నొక్కిచెప్పారని వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది.డాక్టర్ ఎస్ జైశంకర్ కూడా “యూరప్‌కు ఒక దృక్కోణం ఉంది , వారు ఎంచుకుంటారు, అది యూరప్  హక్కు. కానీ యూరప్ తన అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి,  భారత్‌ను మాత్రం ఇంకేదో  చేయమని అడుగుతోంది(ఇది ఆమోదయోగ్యం కాదు) ” అన్నారు.

విలేకరుల సమావేశంలో ఎస్. జైశంకర్ మాట్లాడుతూ, “మొదట మనం వాస్తవాలను చాలా స్పష్టంగా చూడాలని నేను భావిస్తున్నాను. ఫిబ్రవరి 24 మరియు నవంబర్ 17 మధ్య, యూరోపియన్ యూనియన్ రష్యా నుండి  10 దేశాల కంటే ఎక్కువ శిలాజ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంది.  యూరోపియన్ యూనియన్ చమురు దిగుమతి భారతదేశం దిగుమతి చేసుకున్న దానికంటే ఆరు రెట్లు ఎక్కువ. గ్యాస్ అనంతం(ఇన్ఫినిటీ) ఎందుకంటే మనం దానిని దిగుమతి చేసుకోలేదు, యూరోపియన్ యూనియన్ 50 బిలియన్ల యూరోల విలువైన (గ్యాస్) దిగుమతి చేసుకుంది” అని తెలిపారు.

మిడిల్ ఈస్ట్ నుంచి క్రూడాయిల్ కొనుగోలు కూడా ధరలపై ఒత్తిడి తెస్తోందని డాక్టర్ జైశంకర్ పేర్కొన్నట్లు పిటిఐ రిపోర్టు చేసింది.
మధ్యప్రాచ్యం నుండి  ముడి చమురు చాలా కొనుగోలు చేసినందుకు యూరోప్ ను డాక్టర్ జైశంకర్ నిందించారు. “సాంప్రదాయకంగా మధ్యప్రాచ్యం భారతదేశం వంటి ఆర్థిక వ్యవస్థకు సరఫరాదారు” అని ఆయన పేర్కొన్నారు.
యూరోపియన్ ఎంపికలు,  యూరోపియన్ విధానాలతో భారత్ కు  చాలా అవగాహన ఉందని ఎస్. జైశంకర్ నొక్కిచెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News