Sunday, December 22, 2024

మత్తులో కుటుంబ సభ్యులను వేధిస్తున్న వ్యక్తికి జైలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రోజు గంజాయి, వైట్నర్ తీసుకుని వచ్చి కుటుంబ సభ్యులను వేధిస్తున్న వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి ఆరవ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లక్ష్మణరావు శుక్రవారం తీర్పు చెప్పారు. రేయిన్‌బజార్ పోలీసుల కథనం ప్రకారం… అమన్‌నగర్, యాఖత్‌పురాకు చెందిన వాహబ్ ఖాన్ గంజాయి, వైట్నర్‌కు బానిసగా మారాడు. రోజు వాటిని తీసుకుని వచ్చి తన ఇంటి పక్కన ఉన్నవారిని, కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో రేయిన్‌బజార్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరపర్చగా మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News