పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి
మాచన రఘునందన్
హైదరాబాద్: రంజాన్, ఉగాది పండగల ను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జాప్యం చేయకూడదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తహశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. గురువారం నాడు ఆయన చింతపల్లి లో గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. వినియోగదారులు తమ చరవాణి ద్వారా గ్యాస్ ను బుక్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. గ్యాస్ డీలర్లు సేవా భావం కలిగి ఉండాలన్నారు. సిలిండర్లను అడ్డగొలుగా ఎవరికి పడితే వారికి అమ్మితే డెలివరి బాయ్స్ పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాల్సి వుంటుందని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడే ప్రసక్తే లేదని రఘునందన్ హెచ్చరించారు.
గ్యాస్ బండలు, ఎవరు బుక్ చేశారు..ఎవరివి , ఎవరెవరికి చేరుతున్నాయి. వినియోగదారులకు రసీదులు ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. రసీదులు లేకపోతే అక్రమాలు జరిగే అవకాశం లేకపోలేదని రఘునందన్ అనుమానం వ్యక్తం చేశారు. గ్యాస్ డెలివరీ బాయ్ లు ఎక్కువ వసూలు చేయడంపై చిట్యాల లో జరిగిన ఉదంతం గ్యాస్ డెలివరీలో జరుగుతున్న ఇష్టా రాజ్యాన్ని బహిర్గతం చేసిందని, అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా డీలర్లు అప్రమత్తంగా ఉండాలని రఘునందన్ సూచించారు.